MHRD Seeks Parents Opinion on Reopen Schools: పాఠశాలలను ఎప్పటి నుంచి పునఃప్రారంభిద్దాం.. ఎంహెచ్‌ఆర్‌డీ

MHRD Seeks Parents Opinion on Reopen Schools: పాఠశాలలను ఎప్పటి నుంచి పునఃప్రారంభిద్దాం.. ఎంహెచ్‌ఆర్‌డీ
x
MHRD Seeks Parents Opinion On When To Reopen Schools
Highlights

MHRD Seeks Parents Opinion on Reopen Schools: కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్దులంతా ఇంటికే పరిమితమయ్యారు.

MHRD Seeks Parents Opinion on Reopen Schools: కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్దులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం స్కూళ్ల పునఃప్రారంభం విషయంలో కసరత్తు ప్రారంభించింది. పాఠశాలలను ఎప్పుడు పునఃప్రారంభిస్తే బాగుంటుందనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విద్యార్ధులు తల్లిదండ్రులకు కూడా అవకాశం కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను ఎప్పటి నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నారో రాష్ట్రాల వారీగా అభిప్రాయాలను తెలపాలని సూచించారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కోరింది. ఈ మేరకు అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు ఎంహెచ్‌ఆర్‌డీ అండర్‌ సెక్రటరీ రాజేశ్‌ సాంప్లే లేఖలు రాశారు. పాఠశాలలను ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలల్లో ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ నెలలో ప్రారంభిస్తే బాగుంటుందో తెలపాలని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ లోగా వారి నిర్ణయాన్ని చెప్పాలని సూచించారు.

ఈనెల 15న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో స్కూల్‌ సేఫ్టీ ప్లాన్‌పై ఎంహెచ్‌ఆర్‌డీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ లో అధికారులు మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభంపై అభిప్రాయాలను తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు మూడు రోజులకే మళ్లీ అభిప్రాయాలను తెలియజేయాలంటూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక పోతే 17 రాష్ట్రాల అధికారులు ఈనెల 15న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల ప్రారంభ తేదీలను ఇంకా నిర్ణయించలేదని వెల్లడించాయి. వాటితో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్, ఛత్తీస్‌గఢ్, డయ్యూ డామన్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, గోవా, గుజరాత్, లక్షద్వీప్, ఒడిషా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నా యి. మిగిలిన ఐదు రాష్ట్రాలు మాత్రం కేంద్రం జారీ చేసే ఆదేశాల మేరకు ప్రారంభిస్తామని వెల్లడించాయి. ఇక మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తేదీలను, నెలలను నిర్ణయించినట్లు వెల్లడించాయి.

ఇక కొన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను చూసుకుంటే కర్ణాటక (సెప్టెంబర్‌ 1 తరువాత), కేరళ, లఢక్‌ (ఆగస్టు 31 తరువాత), మణిపూర్‌ (సెప్టెంబర్‌ 1న), అస్సాం (జూలై 31న), బిహార్‌ (ఆగ స్టు 15న), చండీగఢ్‌ (ఆగస్టు 15 తరువాత), ఢిల్లీ (ఆగస్టులో), హరియాణా (ఆగస్టు 15), నాగాలాండ్‌ (సెప్టెంబర్‌ మొదటివారం), పాండి చ్చేరి (జూలై 31 తరువాత), రాజస్తాన్‌ సెప్టెంబర్‌లో స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి. అందులో సెప్టెంబర్‌ 5న స్కూళ్ల ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్, ఆగస్టు తరువాత ప్రారంభిస్తామని అరుణాచల్‌ ప్రదేశ్‌ వెల్లడించాయి. అయితే చివరిగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని స్కూళ్ల పునఃప్రారంభ తేదీలను నిర్ణయించనున్నారు. ఆ వివరాలను తమ మెయిల్‌ ఐడీకి (coordinationeel @gmail.com లేదా rsamplay. [email protected]) పంపించాలని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories