ఆపరేషన్ చేసి కత్తెర మరిచిపోయిన డాక్టర్లు!

warangal MGM Hospital : ఓ సమస్య పరిష్కారానికి వెళ్తే మరో సమస్య తెచ్చిపెట్టారు డాక్టర్లు. అల్సర్ అని వచ్చిన పేషంట్‌కు ఆపరేషన్‌ చేసి.. కడుపులో కత్తెర పెట్టి పంపారు.

admin
Published on: 15 Oct 2020 1:27 PM IST
ఆపరేషన్ చేసి కత్తెర మరిచిపోయిన డాక్టర్లు!
X

warangal MGM Hospital : ఓ సమస్య పరిష్కారానికి వెళ్తే మరో సమస్య తెచ్చిపెట్టారు డాక్టర్లు. అల్సర్ అని వచ్చిన పేషంట్‌కు ఆపరేషన్‌ చేసి.. కడుపులో కత్తెర పెట్టి పంపారు. సర్జరీతో అంతా సర్దుకుంటుందిలే అనుకున్న ఆ పేషం‌ట్‌కు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. ఇదేంటని మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లటంతో కడుపులోని కత్తెర విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్లు.

బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి అల్సర్‌తో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌ వైద్యులను ఆశ్రయించాడు. వైద్యుల సూచనతో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయితే ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర మరిచిపోయారు. పేషంట్‌కు మరోసారి కడుపునొప్పి రావటంతో హాస్పిటల్‌కు రాగా..ఎక్స్‌రే తీశారు డాక్టర్లు. అందులో కత్తెర ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు మరోసారి ఆపరేషన్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

admin

admin

Next Story