పది పరీక్షలకు ముందు రోజు మెసేజ్‌లు

పది పరీక్షలకు ముందు రోజు మెసేజ్‌లు
x
Highlights

కరోనా లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పదో తరగతి పరీక్షలు జూన్ 9 నుంచి జూలై 5 వరకు జరగనున్న విషయం తెలిసిందే.

కరోనా లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పదో తరగతి పరీక్షలు జూన్ 9 నుంచి జూలై 5 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తల్లో భాగంగా మారిన సెంటర్లు, ఇతర సమాచారాన్ని అభ్యర్ధులకు ముందుగా తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. వీరికి సంబంధించి గతంలో టైం టేబుల్ కు సంబంధించి ఏయే కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల రాయాలో ఇప్పటికే సమాచారం ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల వాయిదా పడటంతో పాటు కరోనా వల్ల కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ సమాచారం విద్యార్దులకు తెలిసేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. కొత్త నిబంధనల వల్ల విద్యార్ధులు దూరం, దూరంగా కూర్చొని రాయాల్సి ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సెంటర్లు అవసరమవుతాయయి.

దీనివల్ల కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకే పరీక్షల ముందు విధ్యార్థులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలు చూసుకుంటే పరీక్ష రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

జూన్ 7 నుంచే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచుతామని అన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని, ఈ క్రమంలో అదే రోజు వెళ్లినా సమీపంలోని(కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చని ఆయన అన్నారు. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కాస్త ఆలస్యమైనా అనుమతిస్తామని అన్నారు. ఇక కరోనా జాగ్రత్త చర్యల్తో భాగంగా పరీక్ష సెంటర్ల వద్ద పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా కరోనా జాగ్రత్తల్లో భాగంగా ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ఉంటేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాలను అనుమతించనున్నట్లు తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories