భద్రాద్రి జిల్లాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన మీసాల సూరిబాబు

Bhadradri Kothagudem District: మీసాలను మూడు అడుగుల చొప్పున పెంచిన సూరిబాబు

Shekhar G
Updated on: 27 Dec 2023 9:30 PM IST
Meesala Suribabu has become a special attraction in Bhadradri district
X

భద్రాద్రి జిల్లాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన మీసాల సూరిబాబు 

Bhadradri Kothagudem District: ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఓ ఐడెంటిటీ కోరుకుంటారు. కొందరు రికార్డుల కోసం ఫీట్లు చేస్తే.. కొందరు తమ ప్యాషన్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన మీసాలను ఐడెంటిటీగా మార్చుకున్నారు. తన పొడవాటి మీసాలతో ఆ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన సూరిబాబు..తన పూర్వీకులు పెంచినట్లుగానే తాను కూడా మీసాలు పెంచాడు. సుమారుగా 20 ఏళ్ల నుంచి తన మీసాలను కట్‌ చేయకుండా పెంచుతున్నాడు సూరిబాబు.. అతని మీసాలు మూడు అడుగుల చొప్పున పెంచాడు. అయితే మీసాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి సంరక్షణ, ఖర్చు చేయడం లేదని సూరిబాబు తెలిపారు. తన మీసాలను చూసి ప్రజలు సెలబ్రిటీతో దిగినట్లు సెల్ఫీలు దిగుతుంటే భలే మజాగా ఉందంటున్నారు మీసాల బాబాయి సూరిబాబు.

Shekhar G

Shekhar G

Next Story