Hyderabad: మీర్‌పేట్‌లో మిస్సైన బాలుడి కేసులో ట్విస్ట్.. తిరుమలలో ఆచూకీ లభ్యం

Meerpet Missing Boy Found In Tirupati
x

Hyderabad: మీర్‌పేట్‌లో మిస్సైన బాలుడి కేసులో ట్విస్ట్.. తిరుమలలో ఆచూకీ లభ్యం

Highlights

మహీధర్‌రెడ్డి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈనెల 4న ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Meerpet Boy Missing Case: హైదరాబాద్ మీర్‌పేట్‌లో మిస్సైన బాలుడి ఆచూకీ లభ్యమయ్యింది. మహీధర్‌రెడ్డి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈనెల 4న ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వచ్చిన బాలుడు.. కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లినట్లు గుర్తించారు.

ఇంటి నుంచి వచ్చే సమయంలో తన వెంట తెచ్చుకున్న వెయ్యి రూపాయలతో తిరుమల శ్రీవారి దర్శించుకున్నానని.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పిన మహీధర్‌రెడ్డి. ప్రస్తుతం ఈస్ట్‌ పీఎస్‌లో ఉన్నాడు మైనర్ బాలుడు. మహీధర్‌ను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు పోలీసులు. ఇప్పటికీ 15సార్లు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి..శ్రీవారిని దర్శించుకున్నట్లు చెబుతున్నాడు మహీధర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories