ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

Preeti Case: సైఫ్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్స్ పరిశీలించిన పోలీసులు

Dhatripriya
Published on: 1 March 2023 4:31 PM IST
Medico Preeti Case Key Facts In Saif Remand Report
X

ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

Preeti Case: సంచలనం రేపిన ప్రీతి కేసులో.... సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్‌ ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవి ఎల్‌డిడి నాకౌట్స్‌ గ్రూప్ చాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో ప్రీతిని గైడ్ చేస్తున్న సూపర్‌ సీనియర్‌గా సైఫ్ ఉన్నాడు. డిసెంబర్‌లో ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతికి, సైఫ్‌కు మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. యాక్సిడెంట్ ఘటనలో ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ప్రీతి. అయితే ప్రీతి రాసిన రిపోర్ట్‌ను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి.. అవహేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్‌లో వస్తే ఇలాగే ఉంటుందంటూ గ్రూప్‌లో చర్చించాడు సైఫ్.

Dhatripriya

Dhatripriya

Next Story