Medico Preethi: రోజుకో మలుపు తిరుగుతున్న ప్రీతి కేసు.. ప్రీతి సోదరుడు పృధ్వీ సంచలన వీడియో..

Medico Preethi: కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి కేసు రోజురోజుకీ మరింత సంచలనం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 6 March 2023 10:48 AM IST
Medico Preethi Brother Prithvi Raises Doubts On Toxicology Report
X

Medico Preethi: రోజుకో మలుపు తిరుగుతున్న ప్రీతి కేసు.. ప్రీతి సోదరుడు పృధ్వీ సంచలన వీడియో..

Medico Preethi: కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి కేసు రోజురోజుకీ మరింత సంచలనం రేపుతోంది. ఇవాళ ప్రీతి సోదరుడు పృధ్వీ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. నిమ్స్‌లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని... ఆ సర్జరీ ఎందుకు చేశారనేది తెలియడం లేదన్నాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని తెలిపాడు. బ్లడ్ డయాలసిస్ చేస్తే... ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు.

నిమ్స్‌లో ఏం వైద్యం చేశారనేది తమకు చెప్పాలని ప్రీతి సోదరుడు పృధ్వీ డిమాండ్ చేశాడు. టాక్సికాలజీ రిపోర్ట్ పై తమకు మొదటి నుంచి అనుమానాలున్నాయని... తన సోదరి శరీరంలో బ్లడ్, ప్లాస్మా ఎక్కించిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే రిపోర్ట్‌లో విష నమూనాలు ఉన్నట్లు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. తమకు పోలీసులపై నమ్మకం ఉందని.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరిపించాలని కోరారు.

ఇక ఇప్పటికే నిందితుడు సైఫ్‌ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా.. ప్రత్యేక బృందం లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు. త్వరలో కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు విచారణ జరుగుతుండగానే వరంగల్ సీపీ రంగనాథ్‌కు.. డీజీపీ అంజనీకుమార్‌ నుంచి పిలుపొచ్చింది. డీజీపీని రంగనాథ్ కలవబోతున్నారు. డీజేపీ-వరంగల్ సీపీ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story