ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...
TS Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు చుక్కలు...
TS Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మందుల కొరత వేధిస్తుండడంతో ప్రైవేట్ బాట పడుతున్నారు. మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేషంట్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక సిబ్బంది చేతివాటం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదనే టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో కంటే పేషెంట్ల సంఖ్య రెట్టింపయ్యింది. పేషెంట్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులు కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జిల్లా ఆస్పత్రులతో పాటు ఇతర దవాఖానాల్లో మందుల కొరత పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో మెడిసిన్స్ బయట తెచ్చుకోమనే వారు... కానీ ఈ మధ్య దీనిపై విమర్శలు ఎక్కువవడంతో ఉన్న మందులతో నెట్టుకొస్తున్నారు సిబ్బంది. అయితే కొన్ని మెడిసిన్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలని చెబుతున్నారంటున్నారు రోగి బంధువులు.
కొన్ని రోజుల కిందట వరకు నీడిల్, కాటన్, సెలైన్‌తో సహా ఇతర మందు బిల్లలు సైతం బయట నుంచే పేషెంట్ల బంధువులు తెచ్చుకునేవారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కొంత మార్పు వచ్చిందని...అయితే పూర్తిస్థాయిలో మందులు ఇంకా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందుల వల్ల కొందరు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రులు పలు రకాల టెస్ట్‌ల పేరుతో బిల్లులు వేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారంటున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు పేషంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం విషయంలో ఆస్పత్రుల సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడంతో రోగులతో పాటు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది చేతివాటంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం. బెడ్ షీట్ మార్చాలన్న, బెడ్ ఇవ్వాలన్న, ఆడపిల్ల పుడితే ఓ రేట్, అబ్బాయి పుడితే మరోరేటు వసూలూ చేస్తూ పేషెంట్ల బంధువులకు చుక్కలు చూపిస్తున్నారు సిబ్బంది. మందుల కొరతతో పాటు సిబ్బంది చేతివాటంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
బీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
30 Jun 2022 1:00 PM GMTCurd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMT