రెండోరోజు కొనసాగుతున్న షర్మిల ఆమరణ నిరాహార దీక్ష.. లోటస్‌పాండ్‌లో షర్మిలకు వైద్య పరీక్షలు

* షర్మిల వాటర్‌ కూడా తాగకుండా ఉండటంతో.. ఎలక్ట్రో లైట్స్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

R Tripura Malini
Published on: 10 Dec 2022 12:05 PM IST
Medical Tests For YS Sharmila At Lotuspond
X

లోటస్‌పాండ్‌లో షర్మిలకు వైద్య పరీక్షలు

YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. దీక్షా శిబిరానికి చేరుకున్న వైద్యులు.. షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. బీపీ, పల్స్‌, బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ బాగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే షర్మిల నీళ్లు కూడా తాగకుండా ఉండటంతో ఎలక్ట్రో లైట్స్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల గ్లూకోజ్‌ లెవెల్స్‌ కూడా డౌన్‌ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ఇవాళ సాయంత్రం మరోసారి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story