Medical Tests: ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు కొనసాగుతోన్న వైద్య పరీక్షలు

Medical Tests Continue for Raghurama Krishnam Raju in Secunderabad Army Hospital
x

Medical Tests: ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు కొనసాగుతోన్న వైద్య పరీక్షలు

Highlights

Medical Tests: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

Medical Tests: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మూడు గంటలుగా ఆర్మీ డాక్టర్ల బృందం రఘురామకు పరీక్షలు జరుపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు తీసుకొచ్చారు. ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. జ్యుడీషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షణలో టెస్టులు చేస్తుండగా.. వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరిస్తున్నారు అధికారులు. పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories