School Bus Accident: మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డివైన్ గ్రేస్ స్కూల్ బస్

School Bus Accident: మేడ్చల్ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 12:36 PM IST
School Bus Accident: మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డివైన్ గ్రేస్ స్కూల్ బస్
X

School Bus Accident: మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డివైన్ గ్రేస్ స్కూల్ బస్

School Bus Accident: మేడ్చల్ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగారం చౌరస్తా వద్ద డివైన్ గ్రేస్ (Divine Grace) స్కూల్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు. అతివేగం, అజాగ్రత్త కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు.

ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సు డ్రైవర్‌కు బారీ వాహనం (Heavy Vehicle) నడపడానికి అవసరమైన హెవీ లైసెన్స్ (Heavy License) లేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యంపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ బస్సుల నిర్వహణ మరియు డ్రైవర్ల అర్హతలపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఈ ప్రమాదం మరోసారి హెచ్చరిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story