Medaram: తుది ఘట్టానికి చేరుకున్న మేడారం మహాజాతర

Medaram: తెలంగాణలోని గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర నేటితో ముగియనుంది.

Arun Chilukuri
Published on: 31 Jan 2026 10:59 AM IST
Medaram: తుది ఘట్టానికి చేరుకున్న మేడారం మహాజాతర
X

Medaram: తెలంగాణలోని గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. అయితే, సమ్మక్క- సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహా జాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం...బెల్లంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసినా రాలనంత ప్రజలు ఉన్నారు. దీంతో తాడ్వాయి- మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story