దొంగగా మారిన ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్
MBA Graduate: అతడు ఏంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూనే దొంగగా మారాడు.
దొంగగా మారిన ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్
MBA Graduate: అతడు ఏంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూనే దొంగగా మారాడు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేష్ సుమారు 200 వరకు చోరీలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. గత నెలలో గాంధీనగర్ కవాడీ గూడలో జరిగిన కేసులో వంశీకృష్ణ నిందితుడు. వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 19 తులాల బంగారం, 3లక్షల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
Next Story




