Khammam: మరికొద్ది గంటల్లో ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

Khammam: ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్‌ను మరికొద్ది గంటల్లో ఎన్నుకోనున్నారు.

Arun Chilukuri
Published on: 7 May 2021 10:53 AM IST
Mayoral Polls in Khammam Today
X

Khammam: మరికొద్ది గంటల్లో ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

Khammam: ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్‌ను మరికొద్ది గంటల్లో ఎన్నుకోనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ బారినపడిన కార్పొరేటర్లకు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. 60 డివిజనల్లో టీఆర్ఎస్‌ 43 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ పీఠం కోసం ఆశావహులు ఎవరి రేంజ్‌లో వాళ్లు మంతనాలు సాగించారు. టీఆర్ఎస్‌ అధిష్టానం మాత్రం సిల్డ్‌ కవర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను పంపించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం టీఆర్ఎస్ తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి పరిశీలకులుగా హాజరు కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story