Hyderabad: తరచూ రోడ్డు ప్రమాదాలు.. హయత్‌నగర్‌లో స్థానికుల ఆందోళన

Hyderabad: హయత్‌నగర్‌లోని నేషనల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని..

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:09 PM IST
Hyderabad: తరచూ రోడ్డు ప్రమాదాలు.. హయత్‌నగర్‌లో స్థానికుల ఆందోళన
X

Hyderabad: తరచూ రోడ్డు ప్రమాదాలు.. హయత్‌నగర్‌లో స్థానికుల ఆందోళన

Hyderabad: హయత్‌నగర్‌లోని నేషనల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు. ఆందోళనలో స్థానిక కార్పొరేటర్లతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులు అక్కడి నుంచి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story