Srisailam Fire Accident: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా రూ.2 కోట్ల ఆస్తి నష్టం

Srisailam Fire Accident: ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానన్న చక్రపాణి రెడ్డి

Shekhar G
Published on: 1 Sept 2023 3:59 PM IST
Massive Fire Accident At Lalithambika Shopping Complex In Srisailam
X

Srisailam Fire Accident: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏకంగా రూ.2 కోట్ల ఆస్తి నష్టం

Srisailam Fire Accident: శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలోని లాలితాంబిక వాణిజ్య సముదాయంలోని ఎల్ బ్లాకులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 షాపులు పూర్తిగా దగ్ధమై... 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈఓ లవన్నతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. షాపులు కోల్పోయిన 14 మందికి తన వంతు సహాయంగా లక్ష 40 వేల రూపాయలు అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారాన్ని వచ్చేలా కృషి చేస్తానని ఆలయ చక్రపాణిరెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story