Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత..

Maoist Leader Katakam Sudarshan Passed Away
x

Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత..

Highlights

Maoist Leader: మే 31న గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించిన మావోయిస్టు పార్టీ

Maoist Leader: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ అనారోగ్యంతో మృతిచెందాడు. గతనెల మే 31న గుండెపోటుతో చనిపోవడంతో ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మూడు రోజుల క్రితం మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో అంత్యక్రియలను పూర్తిచేసినట్లు మావోయిస్టు పార్టీ సభ్యులు తెలిపారు. సుదర్శన్ స్వస్థలం..ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల బస్తీ. వరంగల్‌లో పాలిటెక్నిక్ చదివిన తర్వాత కమ్యూనిస్టు భావాలకు ఆకర్శితుడై 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు.

సుదర్శన్‌పై హత్య కేసు సహా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్ కేసులున్నాయి. రెండేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో CRPF జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ హస్తం ఉంది. ఈ దాడిలో 70 మంది CRPF జవాన్లు చనిపోయారు. గత నెల 28న ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి పథక రచన చేసింది కూడా ఆయనేనని పోలీసులు తెలిపారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన కొన్నేళ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories