Maoist: హరిభూషన్ భార్య శారదక్క మృతి

Maoist Haribhushan Wife Sharadakka Dead with Corona
x

Maoist: హరిభూషన్ భార్య శారదక్క మృతి

Highlights

Maoist: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ భార్య శారదక్క మృతి చెందారు.

Maoist: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ భార్య శారదక్క మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శారదక్క 24వ తేదీన మరణించినట్టు తెలుస్తోంది. హరిభూషన్ చనిపోయిన నాలుగు రోజులకే ఈ విషాదం నెలకొంది. దీంతో మడగూడెం, సారదక్క కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

హరిభూషణ్‌ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా హరిభూషణ్‌ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే.

Show Full Article
Print Article
Next Story
More Stories