రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు

Reventh Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్

Shekhar G
Published on: 4 July 2023 1:33 PM IST
Many Leaders Joined Congress From BRS And BJP In The Presence Of Revanth Reddy
X

రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు 

Reventh Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాల్లోని పలువురు యువకులను కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పాలన నచ్చకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story