ప్రముఖులకు తప్పని లోన్‌ యాప్‌ వేధింపులు

Harassment of Loan App: మంత్రి కాకాణికి లోన్‌ యాప్‌ ఏజెంట్ల ఫోన్లు

Sriveni Erugu
Updated on: 29 July 2022 12:34 PM IST
Harassment of Loan app that is not Wrong for Celebrities
X

ప్రముఖులకు తప్పని లోన్‌ యాప్‌ వేధింపులు

Harassment of Loan App: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్, ఫైనాన్స్ సంస్థలు, రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సామాన్యులనే కాదు ఏకంగా ప్రముఖులకు సైతం వీరి వేధింపులు తప్పడంలేదు. తాజాగా ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్‌కు లోన్ యాప్ నుండి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. అశోక్ అనే వ్యక్తి ఆన్‌లైన్ లోన్ యాప్‌లో 9లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే అతడు ఈ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో సదరు సంస్థ బెదిరించడం ప్రారంభించింది. అశోక్ ఫోన్‌లో మంత్రి కాకాని నంబర్ ఉండటంతో దానికి బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే మంత్రి పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మంత్రిని బెదిరించిన నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేసారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story