Mano Vignana Yatra 2022: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్న మనోవిజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra 2022:సెయింట్ మేరీ స్కూల్‌లో విజ్ఞాన సదస్సు.. హాజరైన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, FDC చైర్మెన్ ప్రతాప్ రెడ్డి

Jyothi
Updated on: 22 Nov 2022 2:43 PM IST
Mano Vignana Yatra 2022 In Siddipet
X

Mano Vignana Yatra 2022: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్న మనోవిజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra 2022: సూపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మనోవిజ్ఞాన యాత్ర సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చేరుకుంది. సెయింట్ మేరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విజ్ఞాన సదస్సుకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, FDC చైర్మెన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విద్యార్థులకు సమాజంపై అవగాహన కల్పించారు. చెడు అలవాట్ల బారిన పడకుండా విద్యార్థులు తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని FDP చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. మనోవిజ్ఞాన యాత్రకు hmtv మీడియా పార్ట్‌నర్ గా వ్యవహరిస్తోంది.

జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమైంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com

Jyothi

Jyothi

Next Story