ఇవాళ హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

Manikrao Thakre: జిల్లాల కాంగ్రెస్‌ నేతలతో సమీక్షా సమావేశం

Jyothi
Published on: 17 July 2023 9:48 AM IST
Manikrao Thakre to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే

Manikrao Thakre: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌‌రావు ఠాక్రే ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. జిల్లాల కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా నేతలతో భేటీకానున్నారు. సమావేశానికి జిల్లా డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు హాజరుకానున్నారు.

సాయంత్రం యూత్ కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్, డాక్టర్ సెల్, ఇంటెలెక్చువల్ సెల్, ఐటీ సెల్‌లతో కూడా సమావేశం నిర్వహించనున్నారు. రేపు సిద్ధిపేట, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లా నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story