Manikrao Thakre: కేసీఆర్ పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయింది

Manikrao Thakre: 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని మేనిఫెస్టోలో పెడతాం

Shekhar G
Published on: 12 July 2023 4:13 PM IST
Manikrao Thakre Comments On CM KCR
X

Manikrao Thakre: కేసీఆర్ పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయింది

Manikrao Thakre: కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారాయన.. వాస్తవాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్ పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రైతుల గురించి స్పష్టంగా చెప్పారని మరోసారి వెల్లడించారు ఠాక్రే.... కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చెయ్యలేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారాయన.

Shekhar G

Shekhar G

Next Story