గాంధీభవన్‌కు చేరుకున్న మాణిక్‌రావు థాక్రే.. కోమటిరెడ్డికి ఫోన్‌ కాల్‌.. గాంధీభవన్‌కు రానంటూ బదులు..!

* కాంగ్రెస్ నేతలతో వేర్వేరుగా భేటీకానున్న థాక్రే

Dhatripriya
Updated on: 11 Jan 2023 11:38 AM IST
Manik Rao Thackeray Is Incharge Of T Congress Affairs For Hyderabad
X

 హైదరాబాద్‌కు టీకాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే

Manikrao Thakre: తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్నారు టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మాణిక్ రావు థాక్రేకు టీకాంగ్ నేతలు ఘనస్వాగతం పలికారు. రెండురోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్న మాణిక్ రావ్ థాక్రే కాంగ్రెస్ నేతలతో వేర్వేరుగా భేటీకానున్నారు. ఇప్పటికే గాంధీభవన్ కు చేరుకున్న మాణిక్ రావు థాక్రే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. గాంధీభవన్ కు రావాలని ఆహ్వానించారు. అయితే బయటే కలుస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాణిక్ రావు థాక్రేకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాసేపట్లో ఏఐసీసీ సెక్రటరీలతో సమావేశం కానున్నారు మాణిక్ రావు థాక్రే. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ తో భేటీకానున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ నేత భట్టితో మాణిక్ రావు థాక్రే సమావేశం కానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లతో మాణిక్ రావు థాక్రే భేటీకానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం, సాయంత్రం 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశం కానున్నారు మాణిక్ రావు థాక్రే.

ఇక రేపు ఉదయం పదిన్నర గంటలకు డీసీసీ అధ్యక్షులతో మాణిక్ రావు థాక్రే సమావేశం అవుతారు. ఆ తర్వాత అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ, పార్టీలోని వివిధ సెల్స్, డిపార్ట్ మెంట్ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారు మాణిక్ రావు థాక్రే. రేపు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనమవుతారు మాణిక్ రావు థాక్రే.

Dhatripriya

Dhatripriya

Next Story