Telangana: వడగండ్ల వర్షం.. తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు
Telangana: నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులు
Telangana: వడగండ్ల వర్షం.. తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు
Telangana: అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్రనష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం కురిసిన వడగండ్ల వానకు మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో మామిడి కాయలు రాలిపోయాయి. మామిడి తోటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఒక్కసారిగా వడగండ్ల వర్షం కన్నీళ్లను మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.
Next Story




