Manda Krishna Madiga: రేవంత్ కంటే చంద్రబాబు నయం.. మరో ఉద్యమానికి..

Manda Krishna Madiga: తెలంగాణలో చేయూత ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Oct 2024 7:46 AM IST
Mandakrishna Madiga Said that AP CM Chandrababu is Much Better Than Telangana CM
X

Manda Krishna Madiga: రేవంత్ కంటే చంద్రబాబు నయం.. మరో ఉద్యమానికి..

Manda Krishna Madiga: తెలంగాణలో చేయూత ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా లబ్దిదారులకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తామని .. ఆ తర్వాత విస్మరించిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డికి లేదన్నారు.

నవంబర్ మొదటివారంలో పెన్షన్ తో పాటుపది నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే వికలాంగుల సమాజాన్ని చేయుత దారులను అందర్నీ మరో ఉద్యమానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఎమ్మార్పీఎస్ బాధ్యత తీసుకుంటుందని అన్నారు.

నవంబర్ 1 నుండి 16 వరకు జిల్లాలవారిగా పెన్షన్ దారులతో మహాసభలు నిర్వహిస్తామని.. నవంబర్ 17 నుంచి 23 వరకు అన్ని జిల్లాల్లో చేయూత పెన్షన్ దారులతో జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తాం అన్నారు. నవంబర్ 26న పెన్షన్ దారుల పోరాట దినంగా ప్రకటించి..వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామన్నారు. ఇందిరా పార్క్ దగ్గర వికలాంగుల మహా గర్జన వేలాది మందితో నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story