Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లో ఇందారం ఎక్స్ రోడ్డు దగ్గర.. ఆగి ఉన్న బొలీరో వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొన్నది.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 11:07 AM IST
Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
X

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లో ఇందారం ఎక్స్ రోడ్డు దగ్గర.. ఆగి ఉన్న బొలీరో వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story