Mancherial: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణపై కేసు నమోదు

Mancherial Municipal Commissioner Balakrishna Case Registered
x

Mancherial: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణపై కేసు నమోదు

Highlights

Mancherial: భార్య ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువుల ఫిర్యాదు

Mancherial: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌ బాలకృష్ణపై కేసు నమోదైంది. భార్య జ్యోతి ఆత్మహత్యపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్‌పై వరకట్న వేధింపులతో పాటు జ్యోతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిన్న ఉరివేసుకొని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం తమ కూతురిని వేధించాడని మృతురాలి తల్లిదండ్రులు కమిషనర్‌పై ఆరోపణలు చేశారు. బాలకృష్ణ, అతని కుటుంబసభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మృతురాలు జ్యోతి, బాలకృష్ణ ఫోన్‌లను పోలీసులు సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories