Top
logo

సొంత పార్టీ సర్పంచ్‌ పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బూతు పురాణం

Manakondur MLA Rasamayi Balakishan and Kareempet Sarpanch Audio Call Viral in Social Media
X

రసమయి బాలకిషన్ (ఫైల్ ఫోటో)

Highlights

* సొంత పార్టీ సర్పంచ్‌ పై బూతు పురాణం * నా భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు- కరీంపేట సర్పంచ్ మల్లయ్య

Rasamayi - Kareempet Sarpanch: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. సొంత పార్టీ సర్పంచ్‌పై రసమయి బాలకిషన్ బూతు పురాణం వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కరీంపేట సర్పంచ్ మల్లయ్య సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేశారు సర్పంచ్ మల్లయ్య. తనకు మద్ధతుగా వచ్చిన తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం మాజీ సర్పంచ్‌పై పోలీసులతో దాడి చేయించారని మల్లయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే బాలకిషన్ దౌర్జన్యాలు, వేధింపులు భరించలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


Web TitleManakondur MLA Rasamayi Balakishan and Kareempet Sarpanch Audio Call Viral in Social Media
Next Story