ప్రాణం తీసిన అనుమానం.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య..

Hanamkonda: పెళ్లై రెండు నెలలు కూడా నిండలేదు. కానీ అంతలోనే కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకొని చివరకు భార్యను కాటికి పంపాడు ఓ భర్త.

Arun Chilukuri
Published on: 2 Aug 2022 7:15 PM IST
Man Murders Wife, Kills Self in Hanamkonda
X

ప్రాణం తీసిన అనుమానం.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య..

Hanamkonda: పెళ్లై రెండు నెలలు కూడా నిండలేదు. కానీ అంతలోనే కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకొని చివరకు భార్యను కాటికి పంపాడు ఓ భర్త. అంతేకాదు తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆత్మకూరుకు చెందిన తల్లా హరీష్ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన పుష్పలీలను జూన్ 19న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచే భార్యపై అనుమానంతో నిత్యం ఘర్షణ పడేవాడు. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరగగా కోపంతో ఊగిపోయిన హరీష్ భార్య గొంతుపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story