Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌లో డబుల్ మర్డర్.. భార్యను నరికి.. కొడుకును సంపులో పడేసిన తండ్రి..

Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌‌ స్టేషన్‌ పరిధిలోని అనాజీపూర్‌లో దారుణం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 15 March 2023 4:12 PM IST
Man Kills Wife and One Month Infant Son in Hyderabad
X

Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌లో డబుల్ మర్డర్.. భార్యను నరికి.. కొడుకును సంపులో పడేసిన తండ్రి..

Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్టు పోలీస్‌‌ స్టేషన్‌ పరిధిలోని అనాజీపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొడ్డలితో నరికి చంపి.. నెల పసికందును నీటి సంపులతో ముంచి హత్య చేశాడు ధన్‌రాజ్‌. బండరావిరాలకు చెందిన లావణ్య, అనాజీపూర్‌కు చెందిన ధన్‌రాజ్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల పాప, నెలరోజుల బాబు ఉన్నాడు. లావణ్యను ఈరోజే పుట్టింటి నుండి తీసుకొచ్చాడు ధన్‌రాజ్‌. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య లావణ్య, నెలరోజుల బాబును హత్య చేశాడు. తల్లి, తమ్ముడిని తన తండ్రి ఎలా హత్య చేశాడో రెండున్నరేళ్ల పాప తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధన్‌రాజ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story