Hyderabad: వేట కొడవలితో వెంటాడి నిండు గర్భిణిని నరికి చంపిన ఆడపడుచు భర్త..

Hyderabad: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణ హత్యకు గురైంది.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 1:56 PM IST
Man killed his brother in law wife over Family Disputes in Gachibowli
X

Hyderabad: వేట కొడవలితో వెంటాడి నిండు గర్భిణిని నరికి చంపిన ఆడపడుచు భర్త..

Hyderabad: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణ హత్యకు గురైంది. వేట కొడవలితో ఆడపచుడు భర్త నరికి చంపాడు. రాజమహేంద్రవరానికి చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి చిన్నమ్మ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు 2020లో శ్రీరామకృష్ణతో వివాహం జరిపించాడు. రామకృష్ణ, లక్ష్మీ ప్రసన్న సంసారంలో కొంతకాలంగా కలతలు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ శ్రీరామకృష్ణ మానసికంగా, శారీరకంగా వేధించాడు. గత ఏడాది పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. శ్రీరామకృష్ణ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చందానగర్ పీఎస్‌లో భార్య లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తన పరువు తీయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంకట రామకృష్ణ దంపతులు తనపై ఫిర్యాదు చేయిస్తున్నారని శ్రీరామకృష్ణ వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 6న కొండాపూర్‌లో ఉంటున్న బామ్మర్ది ఇంటికి శ్రీరామకృష్ణ వేట కొడవలితో వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి... వేట కొడవలితో వచ్చిన అతన్ని చూసి కేకలు వేస్తూ బయటికి వెళ్లే ప్రయత్నం చేసింది. నిండు గర్బిణి అయిన స్రవంతిపై వేట కొడవలితో శ్రీరామకృష్ణ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ స్రవంతిని ఆసుపత్రికి తరలించగా అదే రోజు రాత్రి 11 గంటలకు చనిపోయింది. హత్య కేసులో నిందితుడైన శ్రీరామకృష్ణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story