Hyderabad: హయత్ నగర్‌లో హిట్ అండ్ రన్.. ఒకరి మృతి

Hyderabad: కృష్ణారెడ్డిని కారుతో ఢీ కొట్టిన పవన్‌రెడ్డి.. స్పాట్‌లో్నే మృతి

Jyothi
Published on: 6 Oct 2023 11:07 AM IST
Man Dies Hit and Run in Hayathnagar Incident
X

Hyderabad: హయత్ నగర్‌లో హిట్ అండ్ రన్.. ఒకరి మృతి

Hyderabad: హైదరాబాద్ లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు అయ్యింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడంతో ఓ ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి కారుతో సహా నిందితుడు పరారయ్యాడు. హయాత్‌ నగర్‌లో ఓ వైట్‌ కలర్‌ బెంజ్‌ కారు వేగంగా వచ్చి పోషం కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో కృష్ణారెడ్డిగా స్పాట్‌లోనే చనియాడు. .. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. మృతుడ్ని గుర్తించిన పోలీసులు.. హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా నమోదు చేసుకున్నారు.

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైట్‌ కలర్‌ బెంజ్‌ కారు నెంబర్‌ ఆధారంగా.. ఓనర్‌ను వరాల శ్వేతారెడ్డిగా గుర్తించారు. అయితే.. మద్యం మత్తులో పవన్‌ రెడ్డి కారు నడిపి కృష్ణారెడ్డి మృతికి కారణమైనట్టు తేలింది. దీంతో.. మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్ట్‌ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

Jyothi

Jyothi

Next Story