ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు

ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు
x

ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు

Highlights

ఓ కోడిపుంజు మనిషి ప్రాణాన్ని తీసింది. కోడిపుంజు ఏంటి..? అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి బాబు.. మనిషి ప్రాణం తీసినందుకే ఆకోడి...

ఓ కోడిపుంజు మనిషి ప్రాణాన్ని తీసింది. కోడిపుంజు ఏంటి..? అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి బాబు.. మనిషి ప్రాణం తీసినందుకే ఆకోడి పుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు పీఎస్‌లో దాన్ని బంధీని చేశారు. స్టేషన్‌లోనే దానికి దాన వేస్తూ.. తప్పక, విధి లేక ఆకోడికి భద్రత కూడా ఏర్పాటు చేశారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌ గ్రామంలో కోడి పందాలకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు తరలివచ్చారు. అయితే ఈ కనిపిస్తున్న కోడిపుంజును కూడ పందాల కోసం సిద్ధం చేశారు. ఇక పందాలలో భాగంగా కోడికి అమర్చిన కత్తి కొండాపూర్‌ గ్రామానికి చెందిన సత్తయ్యకు తగలకూడని చోట గుచ్చుకుంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా సత్తయ్య మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పందాలరాయుళ్లనే కాక కోడిపుంజును కూడా అదుపులోకి తీసుకున్నారు.

మొత్తానికి సరదా కోసం ఆడే కోడి పందెం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఓ నిండు ప్రాణం బలైంది. మసాలా వేసి మంచినాటు కోడిపుంజు మాంసం తిందామనుకునే వారికి షాక్‌ తగిలించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories