Crime News: మొబైల్‌ కోసం వ్యక్తి దారుణ హత్య

Crime News: దుండగుల చేతిలో గాయపడిన వ్యక్తి మృతి

Shashank Gullapelli
Published on: 1 May 2024 10:50 AM IST
Man Brutally Murdered For Mobile
X

Crime News: మొబైల్‌ కోసం వ్యక్తి దారుణ హత్య

Hyderabad: నగరంలోని గుడిమల్కాపూర్‌లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచారు. అనంతరం దుండగులు మొబైల్‌ తీసుకొని బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story