Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది.

Arun Chilukuri
Updated on: 14 April 2023 1:15 PM IST
Man Assaults ex-lover Under Influence of Alcohol in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ యువకుడు తన మాజీ ప్రేయసి ఇంటికెళ్లి, ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్‎లో జరిగింది. లలిత్ సెహగల్ పబ్‎లో గిటారిస్ట్‎గా పనిచేస్తున్నాడు. అతడు గతంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కాగా లలిత్ రాత్రి మద్యం తాగిన తర్వాత... తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడి, ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు లిలిత్‎ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు లలిత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story