Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు

Man Assault Woman On Road At Jawahar Nagar
x

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు

Highlights

Hyderabad: 15 నిమిషాల పాటు రోడ్డుపైనే నగ్నంగా యువతి

Hyderabad: మణిపూర్ దురాగతాలు మరవకముందే హైదరాబాద్‌ నగరంలో మరో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఓ యువతిని వివస్త్రను చేశాడు ఓ వ్యక్తి. అక్కడే ఉన్న మరో మహిళ అడ్డుపడేందుకు ప్రయత్నించగా.. దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన జవహర్ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని.. బాలాజీనగర్ బస్టాండ్ దగ్గర చోటుచేసుకుంది.

బాలాజీ నగర్ బస్టాండ్ దగ్గర యువతి నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద మారయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. యువతిని అడ్డుకొని దుస్తులను చించేశాడు. నిస్సహాయస్థితిలో ఆ యువతి 15 నిమిషాల పాటు రోడ్డుపైనే నగ్నంగా ఉండాల్సి వచ్చింది. ఇది గమనించిన స్థానికులు అమ్మాయికి కవర్లు కప్పి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో యువతికి రక్షణ కల్పించిన పోలీసులు.. నిందితుడు పెద్ద మారయ్యను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories