Man Arrested for Harassing a lady in Hyderabad: అసభ్య వీడియోలతో యువతిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Chilukuri
Published on: 10 July 2020 6:28 PM IST
Man Arrested for Harassing a lady in Hyderabad: అసభ్య వీడియోలతో  యువతిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

హైదరాబాద్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. నగ్నచిత్రాలతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇతని పేరు శుభం ఓ పాన్‌షాప్‌లో పని చేస్తున్నాడు. ఉండేది హైదరాబాద్ లోని బహదూర్ పురాలో. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ యువతికి దగ్గరయ్యాడు. ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉన్నపుడు తనకు తెలియకుండా ఫోటోలు తీశాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు శుభం. అమ్మాయి న్యూడ్ ఫోటోలు పంపాలని ఆర్డర్ వేశాడు. భయపడిపోయిన ఆ యువతి ఫోటోలు పంపింది. అక్కడితో ఆగక ఆ యువతి సోదరిపై కన్నేశాడు శుభం. ఆమె ఫోటోలు కూడా పంపాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగారుపడ్డ ఆ యువతి చెల్లెలి ఫోటోలను కూడా పంపింది.

ఇదే అదనుగా మరో మాస్టర్ ప్లాన్ వేశాడు కన్నింగ్ శుభం. ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధిత అమ్మాయిలతో చాట్ చేశాడు. ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు యువతరాన్ని అప్రమత్తం చేస్తున్నా ఇలాంటి నేరగాళ్ల బెదిరింపులకు అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు. దీంతో అపరిచితులు ఫోటోలు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story