Mallikarjun Kharge: నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

Mallikarjun Kharge Visit To Hyderabad Today
x

Mallikarjun Kharge: నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 

Highlights

Mallikarjun Kharge: సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలపై చర్చ

Mallikarjun Kharge: పెండింగ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే... ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాక సీపీఎంతో పొత్తుపై ఖర్గే నిర్ణయం ప్రకటించనున్నారు. సీపీఎం ముందు కాంగ్రెస్ రెండు ప్రతిపాదనలను ఉంచింది. సీపీఐ తరహాలోనే మిర్యాలగూడ, రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. లేదంటే, సెకండ్ ఆప్షన్‌గా.. మిర్యాలగూడ సీటుతో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, హైదరాబాద్ పరిధిలో ఒక అసెంబ్లీ సీటును ఇవ్వడానికి అంగీకరించింది. దీనిపై సీపీఎం రియాక్షన్ కోసం హస్తం పార్టీ ఎదురుచూస్తోంది.

మిగిలిన మూడు పెండింగ్ స్థానాల్లోనూ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ కాంగెస్ నేతలతో అధిష్టానం చర్చలు జరుపుతోంది. సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్దులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించనుంది. తుంగతుర్తి విషయంలో సీపీఎంతో చర్చలు తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. తాము ప్రతిపాదించిన రెండు ఆప్షన్స్ లో ఏదో ఒకదానిపై సీపీఎం సానుకూలంగా స్పందిస్తే, లైన్ క్లియర్ అవుతుంది. లేదంటే, ఇక కాంగ్రెస్సే.. తమ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపాల్సి వస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు మాదిగ, మాలలకు చెరో తొమ్మిది సీట్లు కేటాయించింది. మిగిలిన ఎస్సీ స్థానం తుంగతుర్తికి ఈరోజు అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణ లోని 19 ఎస్సీ స్థానాలకుగాను.. ఇప్పటి వరకు 18 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణలో మాల సామాజికవర్గం కన్నా మాదిగ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. సంప్రదాయంగా మాదిగ సామాజికవర్గానికి ఒకటి, రెండు స్థానాలు అధికంగా కేటాయిస్తారు. మరోవైపు, సూర్యాపేట అభ్యర్థిపై సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయి. సూర్యాపేట స్థానానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి ల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories