Mallareddy: ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

Mallareddy: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

Dhatripriya
Published on: 1 May 2023 1:03 PM IST
Mallareddy Sensational Comments On AP Politics
X

Mallareddy: ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

Mallareddy: కార్మికశాఖ మంత్రి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కులరాజీయాలు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులిచ్చినా కట్టలేకపోరని, కాళేశ్వరం ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం సొంత డబ్బుతో కట్టిందన్నారు. ఏపీ పూర్తిగా దివాళా తీసిందని, భవిష్యత్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. తెలంగాణలో జరిగిన ఎంసెంట్ పరీక్షకు ఆంధ్రా విద్యార్థులు 75 వేల మంది హాజరయ్యారన్నారు. తెలంగాణలో నాణ్యమైన విద్య దొరుకుతుందనే నమ్మకంతోనే ఆంధ్రా విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఎంసెట్ రాశారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story