Malla Reddy: ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు.. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్నా

Malla Reddy: మేడ్చల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేను

Jyothi
Published on: 3 Aug 2023 12:37 PM IST
Malla Reddy Sensational Comments
X

Malla Reddy: ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు.. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్నా

Malla Reddy: అసెంబ్లీ లాబీలో మంత్రి మల్లారెడ్డి చిట్ చాట్ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానేనని, గత ఎన్నికల్లో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది కూడా తానేనని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి... మేడ్చల్‌లో కాంగ్రెస్‌లో గ్రూపు గొడవలు తామే సృష్టిస్తున్నామని, తమ మనుషులను, హరివర్ధన్ వర్గాన్ని, కార్యకర్తలుగా పంపి కేఎల్ఆర్‌ను నిలదీశామని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి మల్లారెడ్డి... ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదంటూ... ఆ డబ్బులే రానున్న ఎన్నికలకు ఖర్చు చేస్తానని మల్లారెడ్డి వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story