Malla Reddy: ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి

Malla Reddy: మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం

Jyothi
Published on: 31 Oct 2023 11:30 AM IST
Malla Reddy Election Campaign in Medchal
X

Malla Reddy: ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి

Malla Reddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తనదైన మార్క్ డైలాగ్స్ తో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. నవంబర్ 30న చేతి వేలికి ఇంకు..ఆ తర్వాత తెలంగాణ మొత్తం పింకు అంటూ కార్యకర్తలను, ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన మార్క్ డైలాగ్స్ తో బిఆర్ఎస్ కార్యకర్తలను , ప్రజలను ఉర్రూతలూగిస్తున్నారు కోట్ల రూపాయల బడ్జెట్ తో పోచారం మున్సిపాలిటీ ని అభివృద్ధి చేశామన్నారు.మరికొన్ని పరిష్కారం కాని స్థానిక సమస్యలను మళ్లీ ఎన్నికైన వెంటనే తీరుస్తానని ప్రజలకు హమీ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story