Mal Reddy: కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ

Mal Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి పనులు కొనసాగుతాయి

Shekhar G
Published on: 19 Nov 2023 4:12 PM IST
Mal Reddy Comments On BRS And BJP
X

Mal Reddy: కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ

Mal Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఈ ఎన్నికలు అవినీతి పరులకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించకోవాలని కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదింటి అమ్మాయి పెళ్లికి ఒక లక్ష రూపాయలు తులం బంగారం ఇవ్వబోతున్నామని ...ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు .కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story