PV Expressway: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

PV Expressway: రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 దగ్గర మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 12:51 PM IST
PV Expressway:  పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
X

PV Expressway: రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 దగ్గర మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైనవారిని వారిని ఆస్పత్రికి తరలించారు. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story