Mahabubnagar: కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు కెమికల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 12:05 PM IST
Mahabubnagar: కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు
X

 Mahabubnagar: కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు కెమికల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మరో బస్సులో ప్రయాణికులను తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story