Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Nalgonda: నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టాక్టర్‌ను ఢీకొట్టింది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 12:29 PM IST
Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు
X

Nalgonda: ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు 

Nalgonda: నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కావలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story