హిజ్రాగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి..కడప జిల్లాలో సూసైడ్

Sandeep Eggoju
Published on: 7 Feb 2021 2:16 PM IST
Mahabubnagar district Hijra suicide in Kadapa district
X

Mahabubnagar district Hijra

హిజ్రాగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి కడప జిల్లాలో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. జడ్చర్ల నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్‌‌కు తల్లిదండ్రులు చనిపోయారు. అయితే తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర ఉంటున్న క్రమంలోనే ఏడాదిక్రితం అదృశ్యమయ్యాడు. బంధువులు ఎంత వెతికినా శ్రీకాంత్ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఫిబ్రవరి 4న మేనమామ కొడుకు వినోద్‌కు వీడియో కాల్‌చేసి తాను ప్రజెంట్ కడప ఏఎస్‌ఆర్ కాలనీలో ఉంటున్నానని తనను కొందరు ఇక్కడికి తీసుకువచ్చి హిజ్రాగా మార్చారని చెప్పుకొచ్చాడు.

ఇక తనతో పాటు మరో ముగ్గురు యువకులను కూడా హిజ్రాగా మార్చారని వాపోయాడు. తన పేరు శ్రీలేఖగా మార్చారని చెప్పుకుంటూనే పురుగుల మందు తాగాడు. తాను ఒక యువకుడిని ప్రేమిస్తే మోసం చేసి ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని ఈ అవమానాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఏడ్చుకుంటూ స్పృహ తప్పిపోయాడు. వెంటనే జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులను ఆశ్రయించగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story