కమలంలో కుమ్ములాట : రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనలో జిల్లా అధ్యక్షుడు రాజీనామా..

Arun Chilukuri
Published on: 20 Dec 2020 3:10 PM IST
కమలంలో కుమ్ములాట : రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనలో జిల్లా అధ్యక్షుడు రాజీనామా..
X

మహబూబ్‌నగర్‌ జిల్లా బీజేపీలో ముసలం మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్‌ రాజీనామా చేశారు. తనే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆయన.. రాజీనామా విషయం తెలిపి.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాననడం చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. జితేందర్‌ ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్న ఎర్ర శేఖర్‌ మనస్తాపం చెంది తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన కొనసాగుతుండగానే ఎర్రశేఖర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా బీజేపీలో సీనియర్ నేతలకు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకు మధ్య పొసగడం లేదన్న టాక్ నడుస్తోంది. ఈ విషయమై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story