తండాలో ఉద్రిక్తత.. భూక్యా వీరన్న మరణంపై వీడని మిస్టరీ

తండాలో ఉద్రిక్తత.. భూక్యా వీరన్న మరణంపై వీడని మిస్టరీ
x

తండాలో ఉద్రిక్తత.. భూక్యా వీరన్న మరణంపై వీడని మిస్టరీ

Highlights

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బోడమంచ తండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా తండా వాసులు అనుమానితుల ఇళ్లపై దాడికి పాల్పడి బైకు,...

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బోడమంచ తండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా తండా వాసులు అనుమానితుల ఇళ్లపై దాడికి పాల్పడి బైకు, డబ్బాకొట్టను దగ్ధం చేశారు. మరో వ్యక్తి ఇంటిపై దాడి చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తండాలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తండా వాసులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్పగాయాలు కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్సత్రికి తరలించారు.

నిన్న తండాలో వీరన్న అనే ట్రాక్టర్ డ్రైవర్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. దీనికి కారణం వీరన్న భార్య, తండాలోని ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అడ్డు తొలగించుకునేందుకు వీరన్నను హత్య చేయించిందని తండా వాసులు ఆరోపిస్తున్నారు. దీంతో తండా వాసులు ఇద్దరు ఇళ్లపై దాడికి దిగారు. పోలీసులు భారీగా మోహరించి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories