Viral News: పిలవని పేరంటానికి వెళ్తే జైలుకే.. ఫంక్షన్ హాల్ యజమాని వినూత్న హెచ్చరిక!

Viral News: పిలవని పేరంటానికి వెళ్తే జైలుకే.. ఫంక్షన్ హాల్ యజమాని వినూత్న హెచ్చరిక!
x

Viral News: పిలవని పేరంటానికి వెళ్తే జైలుకే.. ఫంక్షన్ హాల్ యజమాని వినూత్న హెచ్చరిక!

Highlights

Viral News: సాధారణంగా శుభకార్యాల్లో "అతిథి దేవోభవ" అంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ యజమాని మాత్రం "అపరిచితులకు ప్రవేశం లేదు.. వస్తే జైలుకే" అంటూ బాంబు పేల్చారు.

Viral News: సాధారణంగా శుభకార్యాల్లో "అతిథి దేవోభవ" అంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ యజమాని మాత్రం "అపరిచితులకు ప్రవేశం లేదు.. వస్తే జైలుకే" అంటూ బాంబు పేల్చారు. విందు భోజనాల కోసం ముక్కూమొహం తెలియని వారు రావడంతో అసలైన అతిథులకు ఇబ్బంది కలగకుండా ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏముంది ఆ ఫ్లెక్సీలో?

ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలో ఇలా ఉంది:

"ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు లోనికి వచ్చి పట్టుబడితే సెక్షన్‌ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్ష, ₹5,000 జరిమానా విధించబడును."

యజమాని ఆవేదన ఇదే:

పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో పిలవని వారు వచ్చి భోజనాలు చేయడం వల్ల ఆఖరికి బంధుమిత్రులకు భోజనం సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఫంక్షన్ హాల్‌కు గిరాకీ తగ్గిపోతుందని ఆందోళన చెందిన యజమాని, ఈ చట్టపరమైన హెచ్చరికను బోర్డు రూపంలో పెట్టారు. ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోతుండగా, బయట వ్యక్తులు మాత్రం లోపలికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్:

ఈ ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "భోజనం లాగిద్దామని వెళ్తే.. పోలీసులు లాక్కెళ్లి లోపలేస్తారు.. తస్మాత్ జాగ్రత్త!" అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు "అతిథుల గౌరవం కాపాడటానికి ఇదో మంచి ప్రయత్నం" అని సమర్థిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories